మల్లాడికి జగన్‌ ఫోన్‌

మల్లాడికి జగన్‌ ఫోన్‌

ఈనెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జగన్‌.. పుదుచ్ఛేరి మంత్రి మల్లాడి కృష్ణారావుకు ఫోన్‌ చేశారు. విజయవాడలో జరగనున్న తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. 
తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు సహా పలువురు ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలను జగన్ ఆహ్వానించారు. తాము విచ్చేస్తామని కేసీఆర్, స్టాలిన్‌లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు