గజపతినగరం నియోజకవర్గంలో వైఎస్ జగన్

గజపతినగరం నియోజకవర్గంలో వైఎస్ జగన్

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. ఎస్‌.కోట నియోజకవర్గంలో విజయవంతంగా పూర్తి చేసుకొని గజపతినగరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. జగన్ కు సీనియర్‌ నేతలు బొత్స, అప్పలనర్సయ్య, నియోజకవర్గ ప్రజలు ఘనస్వాగతం స్వాగతం పలికారు. జగన్ రాకతో కొత్త వలస-విజయనగరం రోడ్డు జనసంద్రమైంది. డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో చంద్రబాబు నాయుడు మోసం చేశారని గొడికొమ్ము గ్రామ మహిళలు జగన్ ముందు వాపోయారు. రెండేళ్లుగా వడ్డీలేని రుణాలు ఇవ్వటం లేదని, దీంతో తీసుకున్న రుణానికి ప్రతీ నెలా వడ్డీల రూపంలో రూ.3వేలు వసూలు చేస్తున్నారని తమ ఆవేదనను తెలిపారు. ప్రజల సమస్యలను ఓపిగ్గా విన్న జగన్ వారికి భరోసానిస్తూ ముందుకు కదిలారు.