నేడు పులివెందులకు జగన్‌

నేడు పులివెందులకు జగన్‌

ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ కడప జిల్లాకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గం పులివెందులలోనే గడపనున్నారు వైఎస్ జగన్. హైదరాబాద్‌ నుంచి ఇవాళ సాయంత్రానికి పులివెందుల చేరుకోనున్న వైసీపీ చీఫ్.. రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు, ఎల్లుండి పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో స్థానికులను జగన్‌ కలుస్తారు. రేపు సాయంత్రం స్థానిక వీజే ఫంక్షన్‌ హాల్‌లో ఇఫ్తార్‌ విందులో పాల్గొంటారు.