బేగంపేట్ చేరుకున్న జగన్.. నేరుగా ఆసుపత్రికి !

బేగంపేట్ చేరుకున్న జగన్.. నేరుగా ఆసుపత్రికి !

సీఎం జగన్ మోహన్ రెడ్డి షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన 10 గంటలకు తిరుమల  నుండి నేరుగా హైదరాబాద్ వచ్చారు. 
రేణిగుంట ఎయిర్ పోర్టు నుండి  నేరుగా బేగంపేట ఎయిర్ పోర్టుకి సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడి నుండి నేరుగా 11:20కి హైదరాబాద్ లోని కాంటినెంటల్  ఆసుపత్రిలో చికిత్స పొందుతూన్న వైస్ భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డిని  పరమర్శించనున్నారు సీఎం.

తిరిగి నేరుగా బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో 1:20కి  గన్నవరం రానున్న సీఎం, అక్కడి నుండి రోడ్డు మార్గంలో తాడేపల్లి వెళ్లనున్నారు.  కాగా, మూడు రోజులుగా ఆయన పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. ఢిల్లీకి వెళ్లి పలువురు కేంద్ర మంత్రులను కలిసిన జగన్ నేరుగా తిరుమలకు వచ్చారు. అక్కడ బ్రహ్మోత్సవాలు సహా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడి నుంచి తాడేపల్లికి వెళ్లాల్సి ఉన్నా మార్పులు చేసుకోవాల్సి వచ్చింది.