బాబూ.. ఇదేనా 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ..?

బాబూ.. ఇదేనా 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ..?

అసెంబ్లీ సమావేశాల రెండో రోజు వాడీవేడీగా సాగుతున్నాయి. సీఎం జగన్‌, విపక్ష నేత చంద్రబాబు మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా స్పీకర్ ఎన్నికపై తమకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని చంద్రబాబు అసహనం వ్యక్తం చేయగా.. జగన్‌ దీటుగా జవాబిచ్చారు. 

'ఏకగ్రీవంగా ఎన్నికైన స్పీకర్‌ను అన్ని పార్టీల నేతలూ తోడ్కొని రమ్మని ప్రొటెం స్పీకర్‌ చెప్పారు. మా పార్టీ తరఫున నేను తమ్మినేని సీతారామ్‌ను ఆలింగనం చేసుకుని ఆయణ్ను సభాపతి స్థానం వద్దకు తీసుకెళ్తుండగా విపక్షాల నుంచి ఎవరొస్తారా అని చూశాను. టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, మరో సభ్యుడు వచ్చారు. కానీ చంద్రబాబు మాత్రం రాలేదు. ఏదైనా అంటే ముందుగా చెప్పలేదు అంటున్నారు. ఇదేనా సీనియారిటీ?' అని ప్రశ్నించారు. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చంద్రబాబు అంటుంటారని.. ఇదేనా అని ప్రశ్నించారు. ఒక తప్పును వంద సార్లు ఒప్పు అని చెప్పి కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని జగన్‌ విమర్శించారు. చేసిన తప్పుకు చంద్రబాబు సభకు క్షమాపణ చెప్పాలని అన్నారు.