జగన్ కారు గుర్తుపై పోటీ చేయాలి 

జగన్ కారు గుర్తుపై పోటీ చేయాలి 

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తును పక్కన పెట్టి కారు గుర్తు పై పోటీచేయాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. వైసీపీని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పార్టీగా మార్చారని విమర్శించారు. కేసీఆర్‌, జగన్‌ ముసుగు తొలగించి ఒకే వేదికపైకి రావాలని డిమాండ్ చేశారు. దోపిడి సొమ్మును డంప్ చేసి ఏపీపై మూడు పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుందని..150 సీట్లు గెలుస్తామని బుద్ధా వెంకన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో టీడీపీ సిద్ధంగా ఉందని తెలిపారు. శకుని మామ విజయసాయి రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా టీడీపీకి తిరుగులేదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.