జగన్‌కు చంద్రబాబు సూటి ప్రశ్న

జగన్‌కు చంద్రబాబు సూటి ప్రశ్న

వడ్డీ లేని రుణాలపై ఇవాళ అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ జరుగుతోంది. సున్నా వడ్డీకే రుణాలిచ్చిన్టుట రికార్డులను చంద్రబాబు సభలో ప్రవేశపెట్టారు. అందులోని సమాచారాన్ని చదివి వినిపించారు. 2011 నుంచి పెండింగ్‌లో ఉన్న వడ్డీలను కూడా చెల్లించామని గుర్తు చేసిన బాబు.. 'నిన్న ముఖ్యమంత్రి జగన్‌ నన్ను రాజీనామా చేయమని చెప్పారు. ఇప్పుడు నిజాలు చెప్పాం.. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా?లేదా ప్రజలకు క్షమాపణ చెబుతారా?అని ప్రశ్నించారు. 

టీడీపీ హయాంలో రుణాలు రీషెడ్యూల్‌ చేయలేదని వైసీపీ సభ్యులన్నారని.. కానీ కరువు మండలాలను ప్రకటించాక రుణాలు రీషెడ్యూల్‌ అవుతాయని బాబు వివరించారు. నిన్న సభలో ముఖ్యమంత్ర జగన్‌ ఎందుకంత పరుషంగా మాట్లాడారని చంద్రబాబు ప్రశ్నించారు.  ఇక.. వడ్డీ లేని రుణాల విషయంలో సభను సీఎం తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు టీడీపీ సభ్యులు.