జగన్ పర్యటనలో మార్పులు.. ఆకస్మికంగా హైదరాబాద్ కు ?

జగన్ పర్యటనలో మార్పులు.. ఆకస్మికంగా హైదరాబాద్ కు ?

ఏపీ సీఎం జగన్ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. తిరుపతి నుంచి సీఎం నేరుగా హైదరాబాద్‌ వెళ్లనున్నారు. అనారోగ్యంతో ఉన్న మామ ఈసీ గంగిరెడ్డిని పరామర్శించేందుకు జగన్ హైదరాబాద్ వెళ్తున్నారు. గంగిరెడ్డిని పరామర్శించిన అనంతరం సీఎం తాడేపల్లి బయలుదేరి వెళ్తారు. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం సీఎం తిరుమల నుంచి నేరుగా తాడేపల్లి వెళ్లాల్సి ఉంది. గంగిరెడ్డి అనారోగ్యం గురించి సమాచారం అందడంతో సీఎం తన షెడ్యూల్‌లో మార్పులు చేసుకున్నారు.