బాబూ.. ఎందుకంత భయం?: జగన్‌

బాబూ.. ఎందుకంత భయం?: జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత జగన్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. రీపోలింగ్‌ నిర్ణయాన్ని తప్పుపట్టడంపై మండిపడ్డారు. ఈమేరకు ట్వీట్ చేశారు. 
'రీపోలింగ్‌ అప్రజాస్వామికమా? లేక రిగ్గింగా?  చంద్రగిరిలో దళితుల్ని ఓటు వేయకుండా వారి ఓట్లు మీరు వేయటం అప్రజాస్వామికమా? లేక చెవిరెడ్డి మీ అరాచకాలకు అడ్డుపడటమా? రీపోలింగ్ అంటే మీకెందుకు జంకు? అని ప్రశ్నించారు.