మాట ఇచ్చాను.. వెనక్కి తగ్గను: జగన్‌

మాట ఇచ్చాను.. వెనక్కి తగ్గను: జగన్‌

మద్య నిషేధం విషయంలో మాటిచ్చానని.. ఆ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నిషేధం దిశగా అడుగులు వేస్తూ కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. ఈమేరకు ఇవాళ ఆయన ట్వీట్‌ చేశారు. మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన జగన్‌.. అక్కాచెల్లెళ్ల కన్నీళ్లు తుడుస్తానని మాటిచ్చానని గుర్తుచేశారు. అందులో భాగంగానే మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. బెల్టుషాపులపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్న జగన్‌.. మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానికే అప్పగిస్తూ చట్టాన్ని తెచ్చామని చెప్పారు.  తద్వారా గ్రామాల్లో బెల్టుషాపులు పూర్తిగా మూతబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.