వైఎస్సార్ తండ్రిగా జగపతిబాబు !

వైఎస్సార్ తండ్రిగా జగపతిబాబు !

మహి వి రాఘవ్ దర్శకత్వంలో రూపొందుతున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ 'యాత్ర' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.  ఇందులో వైఎస్సార్ పాత్రను ప్రముఖ నటుడు మమ్ముట్టి చేస్తున్నారు.  అలాగే వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి పాత్రలో ప్రముఖ నటుడు జగపతిబాబు నటిస్తున్నారు. 

ఆహార్యం, గాంభీర్యం రీత్యా ఆ పాత్రకు జగపతి అయితే బాగుంటుందని ఆయన్ను తీసుకున్నారట రాఘవ్.  ఇందులో అనసూయ, సుహాసిని, పోసాని కృష్ణ మురళి, రావు రమేష్ వంటి వాళ్ళు కూడ నటిస్తున్నారు.  ఈ చిత్రాన్ని విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.