జగ్గుభాయ్ బర్త్ డే: కొత్త సినిమాల లుక్ లు

జగ్గుభాయ్ బర్త్ డే: కొత్త సినిమాల లుక్ లు

వైవిధ్య నటుడు జగపతి బాబు నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న పలు సినిమాల పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. తాజాగా శర్వానంద్, సిద్ధార్థ్ నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ‘మహా సముద్రం’. ఈ సినిమాను ఆర్ ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు `చుంచు మామ` పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ పోస్టర్‏ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇక మెగా హీరో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిసున్న చిత్రం ‘గని’. ఈ సినిమాలోనూ జగపతిబాబు నటిస్తుండగా, తాజాగా జగ్గూభాయ్ లుక్ రిలీజ్ చేశారు. నాగశౌర్య నటిస్తున్న ‘లక్ష్య’ సినిమా నుంచి వచ్చిన జగపతిబాబు పోస్టర్ కూడా ఆకట్టుకుంటుంది. కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌ తన ‘రాబర్ట్‌’ సినిమా ద్వారా తెలుగులో తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నాడు. ఈ సినిమాలో జగ్గు ప్రధాన పాత్రలో చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం నుంచి కూడా జగపతిబాబు పోస్టర్ బయటకు వచ్చింది. కాగా, నేడు ఆయన పుట్టినరోజు సందర్బంగా 'ఎఫ్‌సీయూకే‌' సినిమా ఈరోజు థియేటర్లోకి వచ్చింది.