సల్మాన్ సినిమాలో జగ్గుభాయ్!

సల్మాన్ సినిమాలో జగ్గుభాయ్!
సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు జగపతిబాబు. ప్రతినాయకుడి పాత్రల్లో ఆయన నటనకు రోజురోజుకి అభిమానులు పెరిగిపోతున్నారు. ఇటీవల 'రంగస్థలం' సినిమాతో మరో సక్సెస్ ను అందుకున్నాడు ఈ నటుడు. తెలుగులో కాకుండా అప్పుడప్పుడు తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటిస్తూ అక్కడ కూడా పాపులారిటీ సంపాదించాడు. త్వరలోనే ఈ నటుడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ నటించనున్న 'దబాంగ్ 3' సినిమాలో విలన్ పాత్ర కోసం జగపతిని సంప్రదించినట్లు సమాచారం. ప్రభుదేవా డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో నటించడానికి జగపతిబాబు ఆసక్తి చూపిస్తున్నాడట. ఈ నెలాఖరు నుండి సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. సోనాక్షి సిన్హా హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.