జగపతిబాబు ఆశలన్నీ దానిమీదే..!!

జగపతిబాబు ఆశలన్నీ దానిమీదే..!!

హీరోగా కంటే జగపతిబాబు విలన్ గా బాగా పేరు తెచ్చుకున్నాడు.  వరసగా సినిమాలు చేస్తూ బిజీ అయ్యాడు.  అరవింద సమేతలో విలన్ గా విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.  అటు బాలీవుడ్ బడా సంస్థల నుంచి జగపతి బాబుకు విలన్ రోల్ చేయాలని ఆఫర్లు వస్తున్నాయి. 

ఇప్పుడు జగపతి చూపు కోలీవుడ్ వైపు ఉంది.  కొన్నేళ్ల క్రితం రజినీకాంత్ లింగా సినిమా ద్వారా జగపతిబాబు విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు.  కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు.  ఇప్పుడు అజిత్ విశ్వాసం రూపంలో మరో అవకాశం వచ్చింది.  ఇటీవలే రిలీజైన ట్రైలర్ లో జగపతిబాబు విలన్ గా మరోసారి మెప్పించాడు.  ఒక్కమాటలో చెప్పాలంటే అజిత్ కంటే జగపతిబాబు చాలా బాగున్నాడు.  మరి ఈ సినిమా అయినా జగపతిని కోలీవుడ్ లో నిలబడుతుందా చూద్దాం.