ఫ్లాష్ : ఏసు క్రీస్తు రోల్ లో జగ్గూ భాయ్
జగపతి బాబు మొదట హీరోగా ఫామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాడు . లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కానీ 2014లో వచ్చిన లెజెండ్ సినిమాలో విలన్ గా నటించి చాలా బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు కూడా ఆయన ఆ పాత్ర ఈ పాత్ర అని కాకుండా తన మనసుకు నచ్చిన అన్ని పాత్రలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒకప్పుడు ఈయనకు ఎంత లేడీ ఫాలోయింగ్ ఉందో ఇప్పుడు అంతకు మించి పెరిగిందనే చెప్పాలి. పెప్పర్ సాల్ట్ లుక్ తో స్టైలిష్ గా కనిపిస్తున్న జగపతిబాబు ఈరోజు ఉదయం తన ట్విట్టర్లో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. జగపతి బాబు యేసు క్రీస్తు గెటప్ లో ఉన్న పిక్చర్ ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేశాడు. అయితే ఇది సినిమాలోని పోస్టరా ? లేక ఊరికే ఏదైనా ఒక స్టిల్ ని ఎడిట్ చేసి పోస్ట్ చేశారా ? అనేది తెలియక అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే రేపు దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన ఉండనుంది. తలకు ముళ్ళ కిరీటం మేకులతో సిలువకు కొట్టి నా చేతులు రక్తం కారుతున్న మొహంతో జగపతిబాబు ఈ పిక్ లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం జగపతి బాబు విద్యాసాగర్ దర్శకత్వంలో ఫాదర్-చిట్టి-ఉమా-కార్తిక్ అదేనండీ ఎఫ్ సీ యూ కే అనే సినిమాలో నటిస్తున్నాడు. వచ్చేనెల 12న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇందులో జగపతి బాబు తండ్రిగా కనిపించనున్నాడు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)