వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం: జగపతి బాబు

వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం: జగపతి బాబు

నిత్యం వ్యాయామం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని సినీనటుడు జగపతిబాబు అన్నారు. గురువారం ఖైరతాబాద్ శ్రీనగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎఫ్ 45 జిమ్ సెంటర్ ను యువ హీరో సుశాంత్, సుమంత్  లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  మానవునికి సోకుతున్న అనేక వ్యాధులకు కారణం శారీరక శ్రమ లేకపోవడమే నని ప్రపంచ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి అన్నారు. ఈ నేపధ్యంలో  ప్రతి ఒక్కరూ ఒక అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. కరోన వంటి వ్యాధులు ప్రబలుతున్న సమయంలో ప్రజలు కేవలం ఆరోగ్య సూత్రాలను పాటిస్తే ప్రయోజనం ఉండదని, దానితోపాటు వ్యాయామం, క్రీడలు, యోగ ధ్యానం వంటి వాటి పై దృష్టి సారించాలని సూచించారు. రోజులో ఏదో ఒక సమయాన్ని వ్యాయామం కోసం కేటాయించాలని సూచించారు. వ్యాయామాలను నైపుణ్యం కలిగిన శిక్షకుల పర్యవేక్షణలో చేస్తే మరింత ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.