బాహుబలిలో అయన.. సైరాలో ఈయన..!! 

బాహుబలిలో అయన.. సైరాలో ఈయన..!! 

బాహుబలి ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ మీదనే ఎక్కువ క్యూరియాసిటీ ఉండేది.  కారణం ఏంటి.. ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో బాహుబలిని కట్టప్ప వెనకనుంచి పొడుస్తాడు.  దీంతో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు. ఈ ఒక్క మాట సెకండ్ పార్ట్ కు లీడ్ అయ్యింది.  లీడ్ కావడమే కాదు.. సినిమా మొత్తాన్ని నడిపించింది.  సినిమా సూపర్ హిట్ అయ్యింది. 

కాగా, ఇప్పుడు మెగాస్టార్ సైరా గురించి కూడా ఇలాంటి న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.  స్వాతంత్ర సమరయోధుడు కథ కాబట్టి సినిమాలో విలన్లు ఉండరు.  బ్రిటిష్ దొరలే విలన్లు.  అయితే, ఇందులో సైరా నరసింహారెడ్డిని నమ్మించి బ్రిటిష్ దొరలకు పట్టించి నమ్మకంగా వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఒకరు ఉన్నారు.  ఆ పాత్ర పేరు వీరారెడ్డి.  ఆ పాత్రలో జగపతిబాబు కనిపిస్తున్నారట. మరి ఇదినిజమో కాదో తెలియాలంటే అక్టోబర్ 2 వరకు ఆగాల్సిందే.