వీరారెడ్డిగా జగపతిబాబు

వీరారెడ్డిగా జగపతిబాబు

మెగాస్టార్ హీరోగా చేస్తున్న సైరా సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతున్నది.  ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కు చెందిన చాలామంది ప్రముఖులు నటిస్తున్న సంగతి తెలిసిందే.  టాలీవుడ్ నుంచి విలన్ రోల్స్ ప్లే చేస్తున్న జగపతిబాబు ఇందులో ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడు. 

పుట్టినరోజు సందర్భంగా జగపతిబాబు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను యూనిట్ రిలీజ్ చేసింది.  ఇందులో జగపతిబాబు వీరారెడ్డి పాత్రలో కనిపిస్తున్నాడు. గడ్డం, లాంగ్ హెయిర్ తో వీరయోధుడిలా ఉన్న ఆ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు.  దసరా సందర్భంగా సినిమాను రిలీజ్ చేయాలని యూనిట్ ప్రయత్నం చేస్తున్నది.