కళ్ళలో రోషం.. ముఖంలో సంతోషం.. రాజారెడ్డి రాజసం

కళ్ళలో రోషం.. ముఖంలో సంతోషం.. రాజారెడ్డి రాజసం

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది.  ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంది.  ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.  రాజన్నా.. నిన్నాపగలరా.. అనే సాంగ్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.  ఫిబ్రవరి 8 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది. 

ఇదిలా ఉంటె, ఈ సినిమాలో వైఎస్ పాత్రలో మమ్మూట్టి కనిపిస్తున్న సంగతి తెలిసిందే.  రాజారెడ్డి పాత్రలో అరవింద సమేత వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో విలన్ గా నటించిన జగపతిబాబు చేస్తున్నారు. వైఎస్ రాజారెడ్డికి సంబంధించిన పోస్టర్ ను ఈరోజు రిలీజ్ చేశారు.  మొనదేలిన మీసం.. కళ్ళలో రోషం.. ముఖంలో సంతోషం నిండిన ఫోటో అది.  సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వైరల్ గా మారింది ఈ ఫోటో.