FCUK: సినిమా పేరు బూతు కాదండి
ఎఫ్‌సీయూకే (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్) బారసాల (ప్రీ రిలీజ్) వేడుక సందడి సందడిగా, కన్నుల పండువగా జరిగింది. ఇదివరకు ఈ చిత్రంలోని ఆడియో సాంగ్స్‌ను కొవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్స్ చేతుల మీదుగా విడుదల చేయగా, ఈ బారసాల వేడుకలో వాటి వీడియో సాంగ్స్‌ను పాపులర్ యూట్యూబర్స్‌తో రిలీజ్ చేయించడం గమనార్హం. జగపతిబాబు ప్రధాన పాత్రధారిగా, రామ్ కార్తీక్-అమ్ము అభిరామి యువ జంటగా, మరో కీలక పాత్రలో బేబి సహశ్రిత నటించిన 'ఎఫ్‌సీయూకే’ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలకు ముస్తాబవుతోంది. విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్‌పై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మించారు. ప్రధాన పాత్రధారి జగపతిబాబు మాట్లాడుతూ.. 'ఎఫ్‌సీయూకే’ ఆల్రెడీ సక్సెస్ అయింది. టైటిల్‌ను చూసి, కొంతమంది వేరేగా అనుకుంటున్నారు, ఈ సినిమాలో బూతు లేదు. జనాలకు రీచ్ కావాలనే ఆ టైటిల్ పెట్టాం. ఫైనల్‌గా ఆ టైటిల్‌కు అర్థం 'ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్' అని జగపతిబాబు మరోసారి వెల్లడించారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)