తప్పుకోవడంపై జగపతిబాబు క్లారిటీ..!!

తప్పుకోవడంపై జగపతిబాబు క్లారిటీ..!!

మహేష్ 26 వ సినిమా సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతున్నది.  ఇందులో ఓ కీలక పాత్ర కోసం మొదట జగపతిబాబును తీసుకున్నారు.  ఆ పాత్ర ఆయనకు కూడా నచ్చింది.  ఈ సినిమా కోసం జగపతిబాబు రెండు మూడు సినిమాలు వదిలేసుకున్నారు.  

కానీ, సినిమా అంతర్గత కారణాల వలన జగపతిబాబును పక్కన పెట్టారట.  కారణాలు ఏంటనే విషయం తెలియడం లేదు.  సోషల్ మీడియాలో జగపతిబాబును తొలగించడం పట్ల నెగెటివ్ వార్తలు, పుకార్లు వస్తుండటంతో దీనిపై జగపతిబాబు క్లారిటీ ఇచ్చారు.  కొన్ని కారణాల వలన తప్పుకున్నానని చెప్పిన జగపతిబాబు, మహేష్ బాబు, అనిల్ రావిపూరి టీమ్ కు అల్ ది బెస్ట్ చెప్పారు.  జగపతిబాబు క్లారిటీ ఇవ్వడంతో ఈ వివాదం ఇంతటితో ముగిసిందని అనుకోవచ్చు.