వెబ్ సిరీస్ లో జగపతిబాబు!

వెబ్ సిరీస్ లో జగపతిబాబు!
హీరోగా కెరీర్ మొదలుపెట్టిన నటుడు జగపతి బాబు ప్రస్తుతం విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి సినిమాలు చేస్తున్నాడు. విలన్ గా ఆయన నటనకు మంచి గుర్తింపు లభిస్తోంది. రీసెంట్ గా 'రంగస్థలం' సినిమాలో తనదైన నటనతో మెప్పించాడు. దీంతో బాలీవుడ్ లో కూడా అతడిని వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే సల్మాన్ ఖాన్ హీరోగా దర్శకుడు ప్రభుదేవా తెరకెక్కించనున్న సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం జగపతిబాబుని ఫైనల్ చేశారని సమాచారం.goo అయితే ఇప్పుడు వెండితెరపై మాత్రమే కాదు.. వెబ్ సిరీస్ లో కూడా తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. అమెజాన్ వీడియో కోసం భారీ బడ్జెట్ తో ఓ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ సిరీస్ లో జగపతిబాబు గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నాడట. అజయ్ భుయాన్ అనే దర్శకుడు తెరకెక్కించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.