వైయ‌స్సార్ తండ్రిగా జ‌గ్గూభాయ్‌

వైయ‌స్సార్ తండ్రిగా జ‌గ్గూభాయ్‌

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత‌క‌థ ఆధారంగా మ‌హి.వి.రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో `యాత్ర‌` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి భారీ కాస్టింగ్‌ని ఎంపిక చేసుకున్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. 70ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై విజ‌య్ చిల్లా- శ‌శి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

వైయ‌స్సార్ పాత్ర‌లో మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మ‌మ్ముట్టి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. వైయ‌స్ విజ‌య‌మ్మ పాత్ర‌కు, ష‌ర్మిల పాత్ర‌కు, జ‌గ‌న్ పాత్ర‌కు ప‌లువురు న‌టీన‌టుల్ని ఎంపిక చేసుకున్నార‌ని ప్ర‌చార‌మైంది. తాజాగా ఈ సినిమాలో అత్యంత కీల‌క‌మైన వైయ‌స్ రాజారెడ్డి (వైయ‌స్ తండ్రి) పాత్ర‌కు జ‌గ‌ప‌తిబాబుని సంప్ర‌దించార‌ని తెలుస్తోంది. అయితే జ‌గ్గూభాయ్ ఓకే చెప్పారా?  లేదా? అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్‌. మ‌హి.వి.రాఘ‌వ్ టీమ్ ఈ సినిమాని వ‌చ్చే ఎన్నిక‌ల ముందు అంటే జ‌న‌వ‌రిలో రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నార‌ని తెలుస్తోంది.