నిర్మాతగా మారుతున్న ఫ్యామిలీ హీరో

నిర్మాతగా మారుతున్న ఫ్యామిలీ హీరో

ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయిన హీరో ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు జగపతిబాబు.  కుటుంబం అంతా చక్కగా కూర్చొని చూసే సినిమాలలో నటించాడు.  హీరోగా అవకాశాలు తగ్గిపోవడంతో రూటుమార్చి విలన్ గా అవతారం ఎత్తాడు.  విలన్ గా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నాడు.  ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే విలన్ పాత్రలను పోషిస్తున్నాడు.  ప్రస్తుతం అరవింద సమేత, సైరా, యాత్ర వంటి సినిమాలు చేతిలో ఉన్నాయి.  

ఇదిలా ఉంటె, ఇప్పుడు హీరో కమ్ విలన్ నిర్మాతగా మారబోతున్నాడు.  జగపతిబాబు ఓ వెబ్ సీరీస్ ను రూపొందించబోతున్నట్టు సమాచారం.  సినిమాల కంటే ఈ మధ్యకాలంలో వెబ్ సీరీస్ లు బాగా క్లిక్ అవుతున్నాయి.  పైగా అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలు వెబ్ సీరీస్ లను ప్లే చేయడానికి సిద్ధంగా ఉంటున్నాయి.  జగపతిబాబు తండ్రి వీబీ రాజేంద్రప్రాసాద్ నిర్మాత అనే సంగతి అందరికి తెలుసు.  జగపతి ఆర్ట్స్ బ్యానర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి.  ఇప్పుడు జగపతిబాబు కూడా తండ్రిబాటలో నడిచి ఎన్నో చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాలని కోరుకుందాం.