జీసస్ పాత్రలో జగపతిబాబు.. అసలు విషయం ఏంటి..?

జీసస్ పాత్రలో జగపతిబాబు.. అసలు విషయం ఏంటి..?

తెలుగు చిత్ర సీమలో ప్రస్తుతం ఉన్న స్టైలిష్ విలన్ పేరు తెచ్చుకున్న నటుడు జగపతిబాబు. తనదైన నటనతో అందరినీ అలరించాడు. విలన్ పాత్రల్లోనూ ఎంతో గొప్పగా రాణించాడు. జగపతిబాబు కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ ఎన్నో కీలక పాత్రల్లో కనిపించాడు. తన విలక్షణ నటనతో ఇతర భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్న జగపతి బాబు ఇటీవల ఎఫ్‌సీయూకే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇటీవల తాజాగా రిలీజ్ అయిన జగపతి బాబు ఫోటో సామాజిక మాధ్యమాల్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ ఫోటోలో జగపతి బాబు ఎన్నడూ లేని విధంగా జీసస్ క్రీస్ట్‌గా కనిపించాడు. దాంతో ఈ ఫోటో ఎందులోదని అభిమానులు జుట్టుపీక్కుంటున్నారు. జగ్గూభాయ్ చేయనున్న నూతన చిత్రంలో  నుంచి వచ్చిన ఫోటోనా లేదంటే ఇంకదేనికైనా ఈ విధమైన ఫోటో షూట్ జరిపారా అన్నది తెలీదు. అయితే ఇప్పటి వరకు జీసస్ అంటే విజయ్ చందర్ గుర్తొస్తాడు. కరుణామయుడు సినిమాతో యేసుక్రీస్తు అంటే ఇలానే ఉంటాడా అన్నంతగా విజయ్ చందర్‌గారు పాత్రలో నిమగ్నం అయిపోయారు. ఆ తరువాత శాంతి సందేశంలో సూపర్ స్టార్ కృష్ణ యేసు పాత్రలో కనిపించారు. కృష్ణ కూడా ఈ పాత్రలో అందరిని ముగ్దులను చేశారు. దాంతో ఇప్పుడు యేసు పాత్ర చేసేందుకు జగపతి బాబు ముందుకొచ్చాడని అభిమానులు భావిస్తున్నారు. కానీ ఈ ఫోటో సైరా నరసింహారెడ్డి సినిమా సమయంలో సరదాగా చేసిన ఫోటో షూట్ లోనిది. మరి ఈ ఫోటో ఇంతగా వైరల్‌గా మారడంతో జగపతి బాబు వద్దకు జీసస్ పాత్ర చేయాలంటూ ఎందరు క్యూ కట్టనున్నారో చూడాలి. అయితే ఈ ఫోటోలో శిలువు వేసిన యేసు క్రీస్తుగా జగపతి బాబు కనిపించాడు. ముళ్ల కిరీటం ధరించి నెత్తరోడుతున్న ముఖంతో జగపతి బాబు పాత్రలో మునిగిపోయి ఉన్నాడు. అయితే ఈ ఫోటో ఎందులోదో తెలుసుకునేందుకు అబిమానులు ఉవ్విలూరుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల జగపతి బాబు చేసిన ఎఫ్‌సీయూకే సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా కోసం కూడా చాలా మంది ఎదురుచూస్తున్నారు.