బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులో జగ్గు భాయ్

బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులో జగ్గు భాయ్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ సిరీస్ గా పేరొందింది. ఇప్పటివరకు వచ్చిన రెండు పార్ట్స్ ప్రేక్షకుల మెప్పు పొంది బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించాయి. రీసెంట్ గా వచ్చిన రేస్ 3 చిత్రం అభిమానుల అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడింది. ఇక దీని నుండి బయటపడాలనే నెపంతో త్వరలోనే దబాంగ్ 3 చిత్రం సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు సల్మాన్. 

తాజాగా ఈ చిత్రంపై వినిపిస్తున్న వార్తల ప్రకారం జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నాడు. కొద్దీ రోజుల జగ్గు భాయ్ బాలీవుడ్ కి వెళ్తారనే ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ సినిమానే ఫైనల్ కావడం టాక్ అఫ్ థ్ టౌన్ గా మారింది. ఈ సీక్వెల్ కు ప్రభు దేవా దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ ప్రాజెక్టు సెప్టెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. మొదటి రెండు పార్ట్స్ లో హీరోయిన్ గా నటించిన సోనాక్షి సిన్హా నే ఇందులో కూడా నటిస్తుందని సమాచారం. మరి సౌత్ సినిమాలో విలన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న జగపతి బాబు బాలీవుడ్ లో ఎలాంటి మార్క్ ను క్రియేట్ చేస్తారో చూడాలి.