'కలర్ ఫోటో' పై సంచలన కామెంట్స్  చేసిన జగపతిబాబు..

'కలర్ ఫోటో' పై సంచలన కామెంట్స్  చేసిన జగపతిబాబు..

జగపతి బాబు మొదట హీరోగా ఫామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాడు . లాడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కానీ 2014లో వసిసిన లెజెండ్ సినిమాలో విలన్ గా నటించి చాలా బాగా పాపులర్ అయ్యాడు.ఇక విషయానికి వస్తే.. ఇటీవల ‘ఆహా’లో విడుదలైన ‘కలర్ ఫోటో’ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తనను ఎంతగానో ఆకట్టుకుందని జగ్గూభాయ్ చిత్రయూనిట్ పై  ప్రశంసలు కురిపించాడు. ఒక సినిమా హిట్ అవ్వడానికి.. భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్ అవసరం లేదని ‘కలర్ ఫోటో’ రుజువు చేసిందని అన్నారు. ఇలాంటి యంగ్ ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ కలిపి టాలెంట్ తో సినిమాలు చేస్తుంటే.. తనలాంటి సీనియర్లు ఏం చేస్తున్నామో అనిపిస్తుందని జగపతిబాబు అన్నారు. ఇలాంటి సినిమాల్లో తనకు కూడా భాగస్వామ్యం ఉంటే గర్వపడతానని.. కానీ ఈ తరహా చిత్రాలలో తాను నటించననో.. లేక డబ్బులు ఎక్కువ అడుగుతాననో భావించి తనను సంప్రదించడం లేదేమోనని.. కానీ ఆ రెండు నిజం కాదని అన్నారు. చూస్తుంటే ఈ స్టైలిష్ విలన్ చిన్న సినిమాల్లో మంచి పాత్రలు దొరికితే రెమ్యునరేషన్ తగ్గించుకొని నటించడానికి సిద్ధమని తెలుస్తుంది.