సంక్రాంతి బరిలో సీనియర్ నటుడు

సంక్రాంతి బరిలో సీనియర్ నటుడు

తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపుతో అందరూ కోరుకునే కారెక్టర్ ఆర్టిస్ట్ జగపతి బాబు అన్న విషయం తెలిసిందే. హీరోగా పరిచయం ఫ్యామిలీ హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అయితే జగపతి బాబుకు హీరోగా ఉన్నప్పుటి కన్నా కారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాక ఫాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. స్టైలిష్ విలన్‌గా ప్రస్తుతం జగ్గూ భాయ్ మాత్రమే అనేంతగా జగపతిబాబు ప్రేక్షకులను మైమరిపించాడు. ఇప్పుడు మళ్లీ తాను హీరోగా మెప్పించేందుకు సిద్దమవుతున్నాడు. జగపతిబాబు హీరోగా చేసిన కంటెంట్ ఓరియాంటెడ్ సినిమా ఎఫ్‌సీయూకే(ఫాదర్ చిట్టీ ఉమా కార్తిక్). అప్పట్లో జగపతి బాబు హీరోగా చేసిన సినిమాలు సరైన ప్రమోషన్స్ లేక ప్లాప్ అయ్యాయి. కానీ ఈ సారి జగపతి బాబు సినిమాకు నిర్మాతలు భారీ ప్రచారం చేయాలని నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమాలో ఒక్కో పాత్రని రివీల్ చేస్తున్నారు. ప్రతి రోజూ ఓ కారెక్టర్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికి రెండు పాత్రలను పరిచయం చేశారు. ఈ రెండు మంచి ఆసక్తిని కలిగిస్తున్నాయి. మిగతా రెండు పాత్రలు ఏంటనీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి రానుందని అంటున్నారు. అయితే ఈ సంక్రాంతికి ఒక్క ఫ్యామిలీ సినిమా కూడా లేనందున ఈ సినిమా ఆలోటును తీరుస్తుందేమో వేచి చూడాలి.