బాలయ్యకు మళ్ళీ అతనే విలన్ !

బాలయ్యకు మళ్ళీ అతనే విలన్ !

సినిమాల్లో బాలకృష్ణకు సమఉజ్జీ అయిన ప్రతినాయకుడు ఎవరంటే వెంటనే గుర్తిచ్చే పేరు జగపతిబాబు.  బోయపాటి డైరెక్షన్లో రూపొందిన 'లెజెండ్' సినిమాలో బాలయ్య, జగబాబుల రైవలరీ సినిమాకే హైలెట్ అయింది.  పోటీపోటీగా నటించిన ఈ ఇద్దరు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు.  వీరి కాంబినేషన్ పట్ల ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకుంది.  అందుకే కెఎస్ రవికుమార్ బాలయ్యతో చేయనున్న తన నెక్స్ట్ సినిమాలో జగపతిబాబునే ప్రతినాయకుడిగా ఎంచుకున్నారు.  ఈ నెల 17న లాంచ్ కానున్న ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మించనున్నారు.