కేసీఆర్ ని జైల్లో పెట్టిస్తే... బండి సంజయ్ హీరో ఐపోతాడు : జగ్గారెడ్డి
టీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల మధ్య ఉండాలన్నదే కాంగ్రెస్ ఆలోచన అని.. ఆరేళ్లలో ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. రైతుల రుణమాఫీ ఇప్పటి వరకు అమలు కాలేదని...ఆరోగ్య శ్రీ లేదు.. ఫీజు రియాంబర్స్మెంట్ లేదని మండిపడ్డారు. Mim,బీజేపీ రెండు మతతత్వ పార్టీలేనని.. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం అన్నతమ్ముళ్ల లాంటి వాళ్ళేనని తెలిపారు. కేసీఆర్ ని జైల్లో పెడతా అని బండి సంజయ్ అంటారు..ఎందుకు జైల్లో పెడతాడో చెప్పడని ప్రశ్నించారు. బీజేపీ.. నిరుద్యోగ భృతి గురించి ఎందుకు అడగదని నిలదీశారు. బీజేపీ... ప్రజా సమస్యలపై ఎప్పుడూ మాట్లాడటం లేదని మండిపడ్డారు. సీఎంని... బీజేపీ బండ బూతులు తిడుతుంటే...టీఆర్ఎస్ నాయకుల పౌరుషం ఏమైంది..?, మోడీ... పేదల ఖాతాలో వేస్తా అన్న 15 లక్షలు ఏమైందని కూడా టీఆర్ఎస్ అడగడం లేదని నిలదీశారు. అమిత్ షా కి అరేండ్లలో భాగ్యలక్ష్మి అమ్మవారు గుర్తుకు రాలేదు కానీ...జీహెచ్ఎంసీ ఎన్నికలు రాగానే భాగ్యలక్ష్మి అమ్మవారు గుర్తొచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ని జైల్లో పెట్టిస్తే బండి సంజయ్ హీరో ఐపోతాడని... జైల్లో పెడతా అనే మాట బోర్ కొడుతుంది...జైల్లో ఎప్పుడు పెడతావో చెప్పాలని పేర్కొన్నారు. సీఎం మార్పు ఇంటి పంచాయితీ అని... కొడుకుని చేస్తాడో.. కూతురుని చేస్తారో కేసీఆర్ ఇష్టమన్నారు. హరీష్ రాజకీయ నాయకుడా..? పెట్రోల్ పోసుకుని.. అగ్గిపెట్టే వెతికిన వాడు ఉద్యమకారుడా..? అని ఫైర్ అయ్యారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం గుంటనక్కల పార్టీ అని జగ్గారెడ్డి అన్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)