'సీఎల్పీ నాయకుడిగా అవకాశం అడిగా..'

'సీఎల్పీ నాయకుడిగా అవకాశం అడిగా..'

సీఎల్పీ నాయకుడిగా అవకాశం ఇవ్వాలని హైకమాండ్‌ను తాను కూడా అడిగానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ 'నేను అర్హుడినే అనుకుని సీఎల్పీ పదవి ఇస్తే తీసుకుంటా.. నాకు కాకుండా ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేస్తా' అని తెలిపారు. ఈవీఎంలపై ఆరోపణ.. పార్టీ నిర్ణయమని అన్నారు. ఓటమి నేపథ్యంలో బలహీనంగా ఉన్న వారిని అధిష్టానం గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు.