'నా భార్యకు మెదక్‌ టికెట్‌ అడుగుతా..'

'నా భార్యకు మెదక్‌ టికెట్‌ అడుగుతా..'

కాంగ్రెస్‌ పార్టీ ఇమేజ్‌ కాపాడుతూ..సంగా రెడ్డి ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూ అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్ణుడు చావడానికి ఎన్ని కారణాలో జగ్గారెడ్డి గెలవడానికి అన్ని కారణాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. తన బిడ్డ, క్యాడర్‌ కృషి వల్లే మళ్లీ గెలవగలిగానని జగ్గారెడ్డి తెలిపారు. మెదక్‌ పార్లమెంటు సీటు తన భార్యకు ఇవ్వాలని అడుగుతానని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే సంగారెడ్డిలో లక్ష మందితో కృతజ్ఞత సభ నిర్వహిస్తానని వివరించారు.