దేవుడి తరం కూడా కాదు: జగ్గారెడ్డి

దేవుడి తరం కూడా కాదు: జగ్గారెడ్డి

తెలంగాణలో రెవెన్యూ చట్టాన్ని మార్చడం కంటే రెవెన్యూ అధికారుల అభిప్రాయాలు తీసుకుంటే మేలని కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతి లేని శాఖ..అవినీతి లేని రాజకీయ నాయకుడు ఉన్నాడా..? అని ప్రశ్నించారు. లంచగొండితనం లేకుండా చేయడం దేవుడి తరం కూడా కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఇక.. తెలంగాణ ప్రజల్లో మార్పు కనబడుతోందని.. మైనారిటీలు, క్రిస్టియన్లు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో కచ్చితంగా 7 లేక 8 ఎంపీ సీట్లను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేసిన జగ్గారెడ్డి.. క్షేత్రస్థాయిలో తమకు బలం ఉందని గుర్తు చేశారు..