సీఎల్పీ నేతగా అవకాశం అడిగా..
టీడీపీ పొత్తు వల్ల తెలంగాణలో నష్టం జరగలేదని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ పొత్తు వల్ల వైసీపీ మద్దతుదారులు టీఆర్ఎస్కు ఓటేశారని.. ఆ ప్రభావం హైదరాబాద్‌కే పరిమితమని అన్నారు. పొత్తుల వల్లే ఘోరంగా ఓడిపోయామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించడం ఆయన వ్యక్తిగత అభిప్రాయమని జగ్గారెడ్డి అన్నారు. సీఎల్పీ నాయకుడిగా అవకాశం ఇవ్వాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ వ్యవహారాల ఇన్చార్జి కుంతియాని అడిగానని ఆయన చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ పొత్తులు ఉండాల్సిందేనన్న ఆయన..అభ్యర్థులను ఫిబ్రవరిలో నే ప్రకటించాలని కోరానన్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)