గోవా బీచ్ లో జగ్గయ్యపేట వైద్యురాలు మృతి

గోవా బీచ్ లో జగ్గయ్యపేట వైద్యురాలు మృతి

గోవా బీచ్‌లో కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన వైద్యురాలు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఊటుకూరు రమ్యకృష్ణ బీచ్‌లో సెల్ఫీ తీసుకుంటుండగా ఒక్కసారిగా వచ్చిన కెరటాల్లో ఆమె కొట్టుకుపోయారు. నిన్న రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జగ్గయ్యపేట పట్టణంలోని మార్కండేయ బజార్‌కు చెందిన రమ్యకృష్ణకు తల్లి, సోదరులు, సోదరి ఉన్నారు. గతేడాది వరకు జగ్గయ్యపేట ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణిగా పనిచేసిన రమ్యకృష్ణ 2018లో గోవాలో ఉద్యోగం రావడంతో అక్కడికివెళ్లారు.