ఎన్నికలు పెడతానన్నావ్‌.. పెట్టు..

ఎన్నికలు పెడతానన్నావ్‌.. పెట్టు..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ విఫలమయ్యాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ 'ముందస్తు ఎన్నికలు పెడతానన్నావ్‌ కదా.. పెట్టు' అని సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌లో విభేదాలు సహజకమని చెప్పిన జైపాల్‌.. ఎన్నికల సమయానికి అంతా ఒక్కటవుతామని తెలిపారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మర్చితే ఎన్నికల సమయంలో కేసీఆర్‌కే కష్టమని అన్నారు. ఇదే సమావేశంలో బీజేపీపై జైపాల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఉన్నవాళ్లంతా రాక్షసులేనని అన్న జైపాల్‌.. కాసేపటికే మాట మార్చారు.  బీజేపీలో చదువుకున్న వాళ్లు లేరని, పేదల గురించి ఆలోచించేవాళ్లు లేరని విమర్శించారు. ఇక.. ఇటీవల పాస్‌పోర్ట్ జారీ వివాదంలో  మంత్రి సుష్మా స్వరాజ్‌పై సొంత పార్టీకి చెందిన నేతలే మాటల దాడికి దిగడంపై జైపాల్‌ స్పందించారు. జైపాల్‌పై దాడిని ఖండిస్తున్నామన్నారు.