మళ్ళీ తెరమీదకు బీకామ్ లో ఫిజిక్స్... నా భిక్షతోనే గెలిచాడు... 

మళ్ళీ తెరమీదకు బీకామ్ లో ఫిజిక్స్... నా భిక్షతోనే గెలిచాడు... 

బికాం లో ఫిజిక్స్... ఈ మాట చెప్తే చాలు అందరికి గుర్తుకు వచ్చే నేత జలీల్ ఖాన్. ఓ ఇంటర్వ్యూ లో బికాం చదివానని, అందులో ఫిజిక్స్ సబ్జెక్టు ఉందని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు.  అప్పటి నుంచి ఆయన్ను బికాం లో ఫిజిక్స్ అని పిలవడం మొదలుపెట్టారు. అప్పట్లో సోషల్ మీడియాలో ఆ ఇంటర్వ్యూ బాగా ట్రోల్ అయ్యింది.  అంతేకాదు జలీల్ ఖాన్ కు కావాల్సినంత పబ్లిసిటీ కూడా వచ్చింది.  

ఇన్ని రోజుల తరువాత జలీల్ ఖాన్ మరలా మీడియాలో కనిపించాడు.  2019లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి వైకాపా పార్టీ నేత వేంపల్లి పై ఓడిపోయాడు. వేంపల్లిపై జలీల్ ఖాన్ కొన్ని విమర్శలు చేశారు.  తాను పెట్టిన భిక్షతో గెలిచాడని, 3వేల ఓట్లతో గెలిచిన వ్యక్తి ఇప్పుడు రౌడి మాటలు మాట్లాడుతున్నాడని అన్నారు.  తనకు 67 సంవత్సరాలు అని, 27 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నా అని, నువ్వు కుర్రోడివి దమ్ముంటే కొట్టుకుందాం రా, ఎక్కడైనా సరే అని సవాల్ విసిరాడు జలీల్ ఖాన్.  జలీల్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.