టీజర్ : కితకితలు పెడుతున్న జంబ లకడి పంబ

టీజర్ : కితకితలు పెడుతున్న జంబ లకడి పంబ

శివారెడ్డి హీరోగా వస్తున్న జంబ లకడి పంబ సినిమా టీజర్ ఈ మధ్యాహ్నం రిలీజ్ అయింది.  నాని చేతుల మీదుగా రిలీజ్ అయిన ఈ టీజర్ కితకితలు పెట్టె విధంగా ఉన్నది. పెళ్ళైన  తరువాత భార్య భర్తల మధ్య వివాదం రావడం..ఇగో సమస్యల వలన విడిపోవాలని అనుకోవడంతో.. లాయర్ ను సంప్రదిస్తే వారిద్దరిని విడదీసే ప్లాన్ వేస్తాడు.. ఆ ప్లాన్ అమలు చేసే విషయంలో కామెడీ పండుతుంది.  మొత్తానికి పాత టైటిల్ తో వస్తున్న ఈ కొత్త సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.