జేమ్స్ అండ‌ర్స‌న్ ఖాతాలో అరుదైన రికార్డ్...

జేమ్స్ అండ‌ర్స‌న్ ఖాతాలో అరుదైన రికార్డ్...

టెస్ట్ క్రికెట్‌లో 600 వికెట్లు తీసిన మొదటి ఫాస్ట్ బౌలర్ గా జేమ్స్ అండ‌ర్స‌న్ రికార్డ్ సృష్టించాడు. అతనికంటే ముందు కేవలం 3 బౌలర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. కానీ వారందరు స్పిన్నర్లు . అందువల్ల టెస్ట్ మ్యాచ్‌లలో ఫాస్ట్ బౌలర్ల జాబితాలో అత్యధిక వికెట్లు సాధించిన రికార్డును అండర్సన్ నెలకొల్పాడు. ఇక నిన్న ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య జరగనున్న చివరి టెస్ట్ చివరి రోజు పాక్ కెప్టెన్ అజార్ అలీని ఔట్ చేసి అండ‌ర్స‌న్ ఈ ఘనత సాధించాడు. ఈ 37 ఏళ్ల పేసర్ 156 మ్యాచ్‌ల్లో 26.79 సగటుతో 600 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో అతని తర్వాత  గ్లెన్ మెక్‌గ్రాత్ 21.64 సగటుతో 124 మ్యాచ్‌ల్లో 563 వికెట్లతో రెండో స్థానంలో ఉండగా, వెస్టిండీస్ ఆటగాడు కోర్ట్నీ వాల్ష్ 132 టెస్ట్ మ్యాచ్‌ల్లో 24.44 సగటుతో కెరీర్ 519 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్టువర్ట్ బ్రాడ్ - 514 , స్టెయిన్-439 , ఇషాంత్ శర్మ-297, టీమ్ సౌతీ-284, ట్రెంట్ బౌల్ట్-267, మిచెల్ స్టార్క్-244, నీల్‌ వాగ్నర్-206, కేమర్ రోచ్-201 తో ఉన్నారు.