ఇంగ్లాండ్-వెస్టిండీస్ : కరోనా నియమాలు బ్రేక్ 

ఇంగ్లాండ్-వెస్టిండీస్ : కరోనా నియమాలు బ్రేక్ 

ఈ ఏడాది క్రికెట్ ప్రపంచం లో కరోనా ఇచ్చిన 3 నెలల విరామం తర్వాత మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభమైంది. గత బుధవారం ఇంగ్లాండ్-వెస్టిండీస్ తొలి టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో తలపడుతున్నాయి. అయితే కరోనా సమయం లో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఇక ముందు జరగనున్న అన్ని మ్యాచ్ ల కోసం ఐసీసీ కొన్ని కొత్త కరోనా నియమాలను తీసుకవచ్చింది. అందులో ఆటగాళ్లు సామజిక దూరాన్ని పాటించాలి, అలాగే షేక్ హ్యాండ్స్ చేసుకోకూడదు అనే నియమాలు కుడి  ఉన్నాయి. కానీ ఇంగ్లాండ్-వెస్టిండీస్ మాధ్య జరుగుతున్న మొదటి మ్యాచ్ లో మూడవరోజు అంటే నిన్న ఈ  కరోనా రూల్స్ బ్రేక్ చేసారు ఇంగ్లాండ్ ఆటగాళ్లు. ఆతిధ్య జట్టు బౌలర్  జేమ్స్ ఆండర్సన్ ప్రత్యర్థి  రోస్టన్ చేజ్ వికెట్ తీసిన తర్వాత ఆటగాళ్లు అందరూ...  ఆండర్సన్ ను ఆలింగనం చేసుకున్నారు. మరి ఈ విషయం పై ఐసీసీ మరియు ఇసిబి ఆటగాళ్ల పైన ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ కొత్త నియమాలను అలవాటుపడటం ఆటగాళ్లకు కొంత కష్టమే, ఇక ఈ ఇన్నింగ్స్ లో ఆండర్సన్ 3/62 గణాంకాలతో ముగించాడు.