కాశ్మీర్లో ఉగ్ర హెచ్చరికలు.. భయంలో ప్రజలు..!!

కాశ్మీర్లో ఉగ్ర హెచ్చరికలు.. భయంలో ప్రజలు..!!

ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల అలజడులు తగ్గిపోయాయి.  క్రమంగా పరిస్థితులు చక్కబడుతున్నాయని అనుకున్నారు.  క్రమంగా ఆంక్షలను ఎత్తివేస్తున్న సమయంలో ఉగ్రవాదుల పేరిట లోయలో బ్యానర్లు వెలవడం షాక్ ఇస్తోంది.  లోయలో స్కూల్స్ తెరిచినా, దుకాణాలు తెరిచినా.. తగలబెట్టేస్తాం అని పోస్టర్లు వెలవడంతో సైన్యం అప్రమత్తం అయ్యింది.  పోస్టర్లు పెట్టిన వారిపై దృష్టి పెట్టింది.  ఇప్పటికే కొంతమందిని అక్కడి పోలీసులు, సైన్యం అదుపులోకి తీసుకుంది. 

ఇదిలా ఉంటె, అనంతనాగ్ లోని ఆష్ ముఖం మార్కెట్లో దుకాణ దారులను ఉగ్రవాదులు బెదిరించారని, దుకాణాలు మూసెయ్యాలని లేదంటే తగలబెడతామని హెచ్చరించారని దుకాణదారులు చెప్తున్నారు.  దీంతో సైన్యం ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతోంది. మరోవైపు శ్రీనగర్ పరిసర ప్రాంతంలో దుకాణం తెరిచిన ఓ వ్యక్తిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.  దీంతో ఆ వ్యక్తి మరణించాడు.  శ్రీనగర్లో ఉగ్రవాదులు ఉన్నారని తెలుసుకున్న సైన్యం నగరంలో ఆంక్షలు విధించింది.