కేటీఆర్ కు సంస్కారం లేదు

కేటీఆర్ కు సంస్కారం లేదు

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం పట్టించుకున్నా.. లేకున్నా చెప్పాల్సిన బాధ్యత మాకుందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తెలిపారు.  మంత్రి కేటీఆర్ కుసంస్కారిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అది మంచిది కాదని హితవు పలికారు. ఇతరులు అసహించుకునేలా వ్యవహరించటం సరికాదన్నారు.  విమర్శలు చేసుకోవటం, ఆత్మవిమర్శలు చేసుకోవటం మంచిదే...కానీ పరిధులు దాటి మాట్లాడుకోవటం మంచిది కాదన్నారు జానా. ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా  సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఐదేండ్లు పాలనకు అనుమతి ప్రజలు ఇచ్చారని చెప్పారు. ముందస్తుకు పోవాల్సిన అవసరం ఏముందని ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం  ఓవైపు జమిలి ఎన్నికలకు సిద్ధం అని చెప్పి.. రాష్ట్రం వరకే ముందస్తు ఎన్నికలకు పోవటం ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని  ప్రజలు అగ్రహంతో ఉన్నారు. ఆందోళనలు పెరుగుతాయని భయంతోనే ముందస్తుకి వెళ్లాలని అనుకుంటున్నారు జానా రెడ్డి ఆరోపించారు.