'రాష్ట్రంలో ఎంఐఎంతో, కేంద్రంలో మోడీతో..'

'రాష్ట్రంలో ఎంఐఎంతో, కేంద్రంలో మోడీతో..'

రాష్ట్రంలో రెండు లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించాకే ఓట్లు అడుగుతానన్న కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వాటి నుంచి తప్పించుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేశారని ఆరోపించారు. 9 నెలల ముందు ప్రభుత్వాన్ని రద్దు చేయడం దేశంలో ఇదే తొలిసారి అని అన్నారు. రాష్ట్రంలో ఎంఐఎంతో, కేంద్రంలో మోడీతో కుమ్మక్కై కేసీఆర్‌ పాలన కొనసాగించారని జానారెడ్డి ఆరోపించారు. మాల్దీవులలో ప్రజలు ఎదురు తిరిగినట్లు తెలంగాణలో కూడా ఎదురు తిరుగుతారని ఆయన అన్నారు.