జానారెడ్డి కాంగ్రెస్ వాడు కాదా ఏంది..? వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

జానారెడ్డి కాంగ్రెస్ వాడు కాదా ఏంది..? వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

భట్టి దీక్ష సందర్భంగా జానారెడ్డి, వీహెచ్ మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఢిల్లీలో రైతు దీక్షకు జానారెడ్డిని వీహెచ్ విరాళం అడిగారు. జేబులో ఎంత ఉంటే అంత ఇస్తా తీసుకో..సరిపోకుంటే మళ్ళీ ఇస్తానని జానారెడ్డి పేర్కొన్నారు. అలా ఆయన జేబులో 10 వేలు తీసుకున్న వీహెచ్ ఇంకో లక్ష ఇవ్వండి అని అడిగారు. అనంతరం  నా మిత్రుడు జానారెడ్డి నాగార్జున సాగర్ లో గెలుస్తున్నాడు అని వీహెచ్ పేర్కొన్నారు. అయితే జానారెడ్డి ఏమి జానారెడ్డి కాదు ...కాంగ్రెస్ గెలుస్తుంది అని అన్నారు. జానారెడ్డి కాంగ్రెస్ వాడు కాదా ఏంది..?  అని వీహెచ్ ప్రశ్నించగా థాంక్యూ... అని నవ్వి జానా వెళ్లిపోయారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రైతుల పక్షాన పోరాటం చేసిన పరంపరను కొనసాగించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాడుతామన్న ఆయన రైతుల పక్షాన పోరాడుతున్న సంఘాలకు కాంగ్రెస్ మద్దతు ఉంటుందని అన్నారు.