రేవంత్ అభిమానులను ఉద్దేశించి జానా రెడ్డి పరోక్ష వార్నింగ్

రేవంత్ అభిమానులను ఉద్దేశించి జానా రెడ్డి పరోక్ష వార్నింగ్

సోషల్ మీడియా లో పరుష పదజాలం తో దూషించే మాటలు ఎక్కువయ్యాయని రేవంత్ రెడ్డి అభిమానులను పరోక్షంగా ఉద్దేసిస్తూ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా లో కాంగ్రెస్ లోని నాయకులు కూడా జాగ్రత్తగా పోస్టులు చేయాలన్న హైకమాండ్ నిర్ణయానికైనా పంపండి అంతేకానీ  మా నాయకుడు గొప్ప అని... మీ నాయకుడు ఏం చేశాడని పోస్టింగ్ లు మానుకోవాలని ఆయన అన్నారు. నాయకత్వం బలోపేతం కంటే... ఐక్యత దెబ్బతింటుందని ఆయన అన్నారు. అభిమానంతో అవగాహన లేకుండా చేయొద్దన్నఆయన పార్టీ కూడా సీరియస్ గా ఉండాలి..అలాంటి వారిపై పీసీసీ చర్యలు తీసుకోవాలని అన్నారు. అవసరం అయితే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఒకవేళ పీసీసీ చర్యలు తీసుకోకుంటే... అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు.

పీసీసీ  పార్టీ నాయకులందరితో సమావేశం ఏర్పాటు చేయాలన్నజానారెడ్డి వీహెచ్ కి ఫోన్ చేసి ఓ వ్యక్తి మాట్లాడిన పద్దతి కాదని, ఇదొక్కటే కాదు.. చాలా అంశాలు నా దృష్టికి వచ్చాయని ఆయన అన్నారు.  ప్రయోజనాలు... పరిస్థితి పట్టి పార్టీ లో చేరికలు ఉంటాయని ఏ పోరాటం చేయకున్నా... గొప్పగా చూపించే వాళ్ళున్నారని అన్నారు. కాంగ్రెస్ ఏం చేసినా చూపించనోళ్లు ఉన్నారని . ఎంత వరకు కొట్లాడగలమో అంత కొట్లాడుతున్నామని అన్నారు. పదవులు పోయాయని కొంత మంది ప్రస్టేషన్ లో ఉన్నారని అన్నారు.  2018 ఎన్నికలకు... 2019 ఎన్నికల్లో మార్పు రాలేదా..? అని ప్రశ్నించిన ఆయన  ప్రజల మీద విశ్వాసం ఉంచాలని అన్నారు. మేము పరిపాలనకు రాకపోయినా... ప్రజలకు మేలు జరగాలని ఆయన అన్నారు.  మా వల్లనే మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు ప్రజలు మాకు అధికారం ఇస్తారని ఆయన అన్నారు.