బీసీల డిమాండ్లను నెరవేర్చాల్సిందే

బీసీల డిమాండ్లను నెరవేర్చాల్సిందే

బీసీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాల్సిందే నని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత జానారెడ్డి... ఆర్‌. కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సంఘాల ప్రతినిధులను కలిసి జానారెడ్డి... అనంతరం మీడియాతో మాట్లాడుతూ... బీసీ సంఘం ప్రతినిధులు నన్ను కలసి పలు విజ్ఞప్తులు చేశారని... ఆర్.కృష్ణయ్య విద్యార్థి దశ నుంచే బీసీల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని... బీసీల డిమాండ్ల నెరవేర్చాల్సిందే అన్నారు. మహాకూటమిలో అధికారంలోకి వస్తే పెడింగ్ లో ఉన్న అంశాలను నెరవేర్చాలని బీసీ సంఘాల నేతలు కోరారన్న జానారెడ్డి... బీసీల సమస్యలను పరిష్కరించకుండానే కేసీఆర్... ప్రభుత్వాన్ని రద్దు చేశారని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో బీసీలకు సంబంధించిన డిమాండ్లను చేర్చుతామన్న మాజీ మంత్రి... మా పార్టీ, మేనిఫెస్టో కమిటీతో మాట్లాడి బీసీలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కూటమిలో సీట్లు సర్థుబాటుపై కోర్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించిన ఆయన... నాకు అప్పజెప్పిన బాధ్యను నేను నెరవేర్చుతున్నానని... సీట్ల సర్థుబాటుపై వారంలో స్పష్టత వస్తోందన్నారు. కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ గాంధీ సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జానారెడ్డి... ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా మ్యానిఫెస్టో ఉంటోందన్నారు. ఇక మా మేనిఫెస్టోను టీఆర్ఎస్ కాపీ కొట్టిందని ఆరోపించిన ఆయన... మా హామీలకు బడ్జెట్ సరిపోదన్న కేసీఆర్, కేటీఆర్ ఇప్పుడేమంటారు? అని ప్రశ్నించారు.