ఈవీఎంను నేలకేసి కొట్టిన జనసేన అభ్యర్థి

ఈవీఎంను నేలకేసి కొట్టిన జనసేన అభ్యర్థి

అనంతపురం జిల్లా గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని  ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల పోలింగ్‌ కేంద్రంలో ఇవాళ ఉద్రిక్తత చోటు చేసుకుంది. బూత్‌లో ఏర్పాట్లు సరిగా లేవంటూ జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థుల పేర్ల జాబితాను తన ఫోటో లేకుండా ఏర్పాటు చేయడంపై మధుసూదన్ గుప్తా అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. అక్కడే ఉన్న ఈవీఎంను నేలకేసికొట్టారు. మధుసూదన్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు.