ఆ జబ్బు ఏపీని పీడిస్తూనే ఉంది... పవన్ ఆవేదన...

ఆ జబ్బు ఏపీని పీడిస్తూనే ఉంది... పవన్ ఆవేదన...

పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజల మధ్య చిచ్చురేగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్... ప్రాంతీయ విద్వేషాలతో ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర విడిపోయాయని.. ఈ జబ్బు ఇంకా ఏపీని వదలలేదన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు పార్టీ వ్యవహారంలా ఉండకూడదన్న పవన్... రాజధాని అమరావతిలో వద్దని వైఎస్ జగన్ అప్పుడూ చెప్పలేదని గుర్తు చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మార్చుతామంటే ఎలా? అని ప్రశ్నించిన జనసేనాని... అమరావతిని రాజధానిగా అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి... ప్రతిపక్షం కూడా ఒప్పుకుంది కనుకే రైతులు భూములు ఇచ్చారని... గతంలో వైఎస్ జగన్ కూడా అమరావతి రాజధానిగా ఒప్పుకున్నారని తెలిపారు.

రైతులు కన్నీరు పెడితే పోరాటం చేస్తానని స్పష్టంగా అప్పుడే చెప్పానని గుర్తు చేశారు పవన్ కల్యాణ్... ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదని గతంలో జగన్ చెప్పారన్న ఆయన.. అన్ని ప్రాంతాల నేతల అభిప్రాయలు తెలుసుకున్నాం.. రైతుల కన్నీటితో రాజధాని వద్దని ఆనాడు ప్రభుత్వానికి చెప్పానన్నారు. అంచెలంచెలుగా రాజధాని నగరం నిర్మించుకోవచ్చు అన్నారు పవన్.. ఇంకా రాజధాని ప్రాంతంపై జనసేనాని ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి...