దళితులకు అధికారంతో కూడిన పదవులు..

దళితులకు అధికారంతో కూడిన పదవులు..

దళితులకు రాజకీయ పార్టీలు పదవులు ఇస్తాయి... కానీ, అధికారాలు మాత్రం ఇవ్వవు... జనసేన పార్టీ మాత్రం అధికారంతో కూడిన పదవులు ఇస్తోందని స్పష్టం చేశారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్... మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుకు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించిన పవన్... ఈ సందర్భంగా మాట్లాడుతూ... దళిత సామాజిక ఉద్యమాలలో రావెల పనిచేశారని ప్రశంసించారు. అవకాశావాద రాజకీయాలతో దళిత ఉద్యమాలు దెబ్బతిన్నాయన్న ఆయన... విజయవాడ రాజకీయాలు అంటేనే కుల రాజకీయాలు గుర్తుకు వస్తాయి... తిరిగి కుల రాజీయాలు వస్తే రాష్ట్రం కోలుకోలేదన్నారు. చంద్రబాబు... జనసేన పార్టీకి తోడ్పాటు అందిస్తారని తాను భావించ లేదన్న పవన్... గతంలో శాంతిభద్రతలు ఉమ్మడి రాష్ట్రంలో కాపాడారు... కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని విమర్శించారు. మిషన్ 2050 పేరుతో రాజకీయాలు చేయాలని టీటీడీ చూస్తోందన్న జనసేనాని... ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు, ప్రకృతి వనరులను కూడా దోచుకుంటున్నారు... వారిని నివారించే స్థాయిలో చంద్రబాబు లేరని ఎద్దేవా చేశారు. అవినీతిని ప్రశ్నిస్తే భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్... ముఖ్యమంత్రి దళితులుగా పుట్టాలని అనుకోరు... కానీ, పార్టీకి మాత్రం దళితుల ಓట్లు కావాలా? అని మండిపడ్డారు. ఇక భవిష్యత్తులో రావెల కిషోర్‌బాబుకు మంత్రి పదవి ఇస్తామని ప్రకటించారు పవన్ కల్యాణ్.