డ్రోన్ పాలిటిక్స్ ఆపండి...మంత్రుల పై పవన్‌ విసుర్లు 

డ్రోన్ పాలిటిక్స్ ఆపండి...మంత్రుల పై పవన్‌ విసుర్లు 

ఏపీ మంత్రుల తీరు పట్ల జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ధ్వజమెత్తారు. ఒకపక్క వరదలతో ప్రజలు అల్లాడుతుంటే సహాయం చేయకుండా మంత్రులు కరకట్ట చుట్టూ తిరగడం దారుణమని అన్నారు. కరకట్ట మీద నిర్మాణాలు మునిగిపోతాయా లేదా అంటూ డ్రోన్లు ఎగరేసి చూడటం మంత్రుల బాధ్యతా? అని పవన్ ప్రశ్నించారు. వరద ఉధృతి పెరిగితే అన్నీ మునుగుతాయని, డ్రోన్‌ రాజకీయాలు ఆపి లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం ఇంటిని ముంచేస్తారా అని ప్రతిపక్షం...మునిగిందా లేదా అని చూసేందుకు అధికారపక్షం రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. మీ రాజకీయాల వల్ల బాధల్లో ఉన్న ప్రజలను వరద నీటికి వదిలేశారని అన్నారు. ఈ మేరకు కొద్ది సేపటి క్రితం జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.